కైలాస్‌నగర్: తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 6న ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్పిరిలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 99 రో జుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించ నున్న సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సభ ఏర్పాట్లపై శనివారం ఉమ్మడి ఆ దిలాబాద్ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో అసెంబ్లీ కమిటీ హాల్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు పత్రాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధి కారంలోకి రావడానికి బలమైన పునాది వేసిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకు న్న సందర్భాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 6న ఉదయం 11 గంటలకు సీఎం బాసరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటలకు పి ప్పిరి గ్రామానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. సభను జయప్రదం చేసేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎ మ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొ జ్జు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సు ల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ ఉ ప్పల్, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితారాణా, ఆదిలా బాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్‌దీపక్ పాల్గొన్నారు.


