మంచిర్యాలక్రైం: రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లాల్‌సింగ్ శ్రీనివాస్‌నాయక్ పేర్కొన్నారు. దేశ ఉన్నత న్యా యస్థానం ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు చేసి జాతీ య లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల కు సమయం వృథా కాకుండా, అప్పీలు లేకుండా కేసులు పరిష్కారమవుతాయని తెలిపారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సైబర్ క్రైం, సివిల్ తగాదాలు, చెక్‌బౌన్స్, కొ ట్లాట, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన తొమ్మిది బెంచీ ల్లో 3,200 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 15 వా హన పరిహారం కేసులు, తొమ్మిది క్రిమినల్ కేసులు, 3,150 ఇతర కేసులు, 24 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో రూ.2.86లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసినట్లు చెప్పారు. 28 బ్యాంక్‌ఫ్రీ లిటికేషన్ కేసుల్లో రూ.4.50లక్షలు పరిహా రం రూపంలో ఇప్పించినట్లు వివరించారు. జిల్లా న్యా య సేవాధికార సంస్థ ఎ.నిర్మల, రామ్మోహన్‌రెడ్డి, జూని యర్ సివిల్ జడ్జిలు కవిత, నిరోషా, కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, ఉపాధ్యక్షుడు భుజంగ్‌రావు, పోలీసులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


