నస్పూర్: డ్రైవర్ల నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గెడి భాస్కర్ తెలిపారు. శనివారం నస్పూర్‌లోని ఎంఎం గార్డెన్‌లో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి హా జరై సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లు, విద్యార్థులకు శంకర్ నేత్రాలయ కంటి ఆస్పత్రి ద్వా రా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగం, నిర్లక్ష్య పు డ్రైవింగ్, సీటు బెల్ట్ ధరించక పోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బాధ్యత రాహిత్యపు డ్రైవింగ్ కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2025లో152 మంది రోడ్డులో ప్రమాదాల్లో మృతి చెందారని, వందలాది మంది వికలాంగులయ్యారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం మంది 40 ఏళ్లలోపువారే ఉన్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణా లు కాపాడిన వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహవీర్ పథకం’ కింద రూ.25వేల నగదు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అనంతరం డాక్టర్ అభిషేక్ చిందం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, న స్పూర్, మంచిర్యాల లారీ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం, హుస్సేన్ తదితరులున్నారు.


