గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

Mar 28 2026 7:16 AM | Updated on Mar 28 2026 7:16 AM

వాంకిడి: మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా సకాలంలో స్పందించిన 108 సిబ్బంది అతడి ప్రాణాలు కాపాడా రు. 108 ఈఎంటీ ఎనగంటి ప్రవీణ్‌, పైలెట్‌ సా యి తెలిపిన వివరాల ప్రకారం.. ఇందాని గ్రా మానికి చెందిన దుర్గం వెంకటేశ్‌ అనే యువకు డు మద్యం మత్తులో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చే రుకున్న సిబ్బంది గొంతుకు కట్టు కట్టి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆసిఫాబాద్‌ ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement