శ్రీరాంపూర్: ప్రమాదవశాత్తు రెండు కాళ్లు కో ల్పోయిన ఎస్‌ఆర్‌పీ–1 గని ఉద్యోగి సాధం స త్యనారాయణకు రూ.కోటి బీమా చెక్కు అందించారు. కంపెనీకి యూనియన్ బ్యాంక్‌కు మ ధ్య ఉన్న బీమా సౌకర్యం ఒప్పందంలో భాగంగా మంజూరైన మొత్తం శుక్రవారం జీఎం కా ర్యాలయంలో జీఎం శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు ప్ర మాదవశాత్తు మృతి చెందితే.. వారు నేషనల్ బ్యాంకుల్లో వేతనాల ఖాతాలు కలిగి ఉంటే వా రికి రూ.కోటి 25లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. శాశ్వత వైకల్యానికి కూడా ఈ భారీ మొత్తం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఏరియా ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కా ర్యదర్శి కొమురయ్య, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, యూనియన్ బ్యాంక్ రీజినల్ అధికారి అపర్ణారెడ్డి, జోనల్ అధికారి రవీంద్రబాబు, సీనియర్ పీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


