ఇచ్చోడ: మండలంలోని తలమద్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అక్కెపెల్లి లక్ష్మణ్ (54) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ ఉదయం నిర్మల్ నుంచి ఇచ్చోడకు కారులో వస్తుండగా కుప్టిఘాట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని కుంటుంబ సభ్యులు వెంటనే ఇచ్చోడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం నిర్మల్‌లోని పైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేస్తున్న లక్ష్మణ్ వారంక్రితం పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. లక్ష్మణ్ మృతి చెందడంతో మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఇచ్చోడ సర్పంచ్ జలైజాకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంజేశారు.
చెరువులో పడి వృద్ధుడి మృతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి పోశమ్మ చెరువులోపడి బూడిదగడ్డ బస్తీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకా రం.. కూలీ పనులు చేసుకుని జీవించే శీలం రాజం (65) కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం లేక తిరుగుతున్నాడు. ఈనెల 25న ఉదయం 5గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పోశమ్మ చెరువు వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి శుక్రవారం పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. మృతుడి కొడుకు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
30న జిల్లాస్థాయి
స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూ ల్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని జెడ్పీ బా లుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి గుర్రాల హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకే https:// tgss. telangana. gov. in ద్వారా రిజి స్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నా రు. నాలుగో తరగతిలో ప్రవేశం కోసం ఎనిమిదేళ్లలోపు (01.09.2017 నుంచి 31.08.2018 మధ్యలో జన్మించాలి) ఉండాలని తెలిపారు. మూడోతరగతి పూర్తి చేసుకుని నాలుగో తరగతి చదువబోతున్న విద్యార్థులే అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ ప్రతులు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారం, ప్రస్తుత పాఠశాల నుంచి వయస్సు, స్టడీ సర్టిఫికెట్, తహసీల్దార్/పంచాయతీ/మున్సిపాలిటీ/కార్పొరేషన్ నుంచి జనన నమోదు ధ్రువీకరణ పత్రం, మూడోతరగతి పురోగతి నివేది కల కాపీలు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయి ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6 గీ10 మీటర్ షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఒక కేజీ మెడిసిన్ బాల్‌ఫుట్, 800 మీటర్ల రన్, మెడికల్ టెస్ట్ (ఏజ్ వెరిఫికేషన్) ఉంటుందని తెలిపారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ వారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలన్న షరతును హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్యేకు ఊరట లభించింది.


