నేడు బడ్జెట్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు బడ్జెట్‌ సమావేశం

Mar 28 2026 7:28 AM | Updated on Mar 28 2026 7:28 AM

– వివరాలు 9లోu

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు కమి షనర్‌ అన్వేష్‌ తెలిపారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.

శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని రామాలయాల్లో శుక్రవారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన కల్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై తిలకించారు. మందమర్రిలోని రామాలయంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌, సరోజ దంపతులు, పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మంచిర్యాలలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement