బెల్లంపల్లి: బెల్లంపల్లిలో రూ.1.56కోట్ల అంచనాతో జాతికుంట చెరువు సుందరీకరణ చేయబోతున్నామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం రడగంబాల బస్తీ పరిధిలోని జాతికుంట చెరువు సుందరీకరణ పనులకు అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీ సుందరీకరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. చెరువు సుందరీకరణతో ఈప్రాంతం అందంగా తయారు కావడంతో పాటు పురప్రజల దృష్టిని ఆకర్శిస్తుందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, కౌన్సిలర్లు కంకటి ప్రణీత, కాంపల్లి రాజం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు రొడ్డ శారద, బస్తీవాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


