హత్య కేసు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు నిందితుల అరెస్ట్‌

Mar 28 2026 7:16 AM | Updated on Mar 28 2026 7:16 AM

నిర్మల్‌ టౌన్‌: ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని శ్యామ్‌ఘడ్‌ సమీపంలో జరిగిన హత్య కేసును నిర్మల్‌ పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిర్మల్‌ ఏఎస్పీ సాయికిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన శ్రీనివాస్‌, వెంకటేశ్‌, రాజు, గజానంద్‌ వీరంతా.. ఓ మహిళతో ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. విషయం బయటకు రావడంతో తిరుమల తనకే సొంతమని గజానంద్‌ భావించి మిగతా వారితో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 24న శ్రీనివాస్‌, వెంకటేశ్‌, రాజు కలిసి గజానంద్‌కు బాగా మద్యం తాగించారు. శ్యామ్‌ఘడ్‌ సమీపంలోని కోట వెనుక ప్రాంతానికి తీసుకెళ్లి కట్టెలతోకొట్టి, బీరు సీసాలతో గాయపరిచి హత్య చేశారు. శవాన్ని నీటి గుంతలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతుడు గజానంద్‌ మేనత్త ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించి తిరుమల, శ్రీనివాస్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో వారినీ పట్టుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు.

టీటీడీ స్థలం ఆధ్యాత్మిక అవసరాలకు ఇవ్వాలి

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీ పరిధి పాత బస్టాండ్‌లోగల టీటీడీ స్థలాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు ఇవ్వాలని కోరుతూ.. శుక్రవారం ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామికి హనుమాన్‌ భక్త మండలి సభ్యులు నూక శ్రీనివాస్‌, నడిపల్లి లక్ష్మణ్‌రావు వినతిపత్రం అందజేశారు. హనుమాన్‌ మంది రాల వద్ద స్థలం లేక జయంతి సందర్భంగా రో డ్డుపై అన్నదానం చేయాల్సి వస్తోందని తెలిపా రు. ఇందుకు మంత్రి సానుకులంగా స్పంది స్తూ.. సదరు స్థలాన్ని వెంటనే శుభ్రం చేయించి ఇవ్వాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తాన ని మంత్రి హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో హనుమాన్‌ భక్త మండలి సభ్యులు రెడ్డి మహేశ్‌, కొల్లూరి శంకర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement