మంచిర్యాలటౌన్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, ఇది వారి స్వలాభం కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనమైన మారుమూ ల ప్రాంతాల అభివృద్ధిని మరిచారని విమర్శించారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీలో జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్క్ ఆర్డర్, వర్క్ ఎస్టిమేషన్ లేకుండా అభివృద్ధి పేరిట రోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారుల షెడ్లు కూల్చివేయడం దారుణమన్నారు. ఇటీవల బీజేపీలో గెలిచిన ప్రజాప్రతినిధులను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని అభివర్ణించారు. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో ఆంక్షలు విధిస్తూ ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇ లాంటి చర్యలు మానుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, దుర్గం అశోక్, వెంకటేశ్వర్‌రావు, శ్రీదేవి, కమలాకర్‌రావు, పొన్నవేణి సదానందం, నాంపల్లి శ్రీనివాస్, తుమ్మేటి సరిత, గుర్రాల లావణ్య పాల్గొన్నారు.


