అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..

Mar 26 2026 7:35 AM | Updated on Mar 26 2026 7:35 AM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి.. మూర్చవ్యాధితో యువకుడు.. చికిత్స పొందుతూ ఆర్‌ఐ..

నిర్మల్‌టౌన్‌: జిల్లాకేంద్రంలోని శ్యాంఘడ్‌ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరైన హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్యాంఘడ్‌ కోట వెనకాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన పోలే గజానంద్‌ (36)గా గుర్తించారు. గత పదేళ్ల నుంచి నిర్మల్‌లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ జీనవం సాగిస్తున్నాడు. భార్య వదిలివేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో శ్యాంఘడ్‌ కోట వద్ద ముఖంపై గాయాలు, రక్తంతో ఉండడంతో ఎవరైన హత్య చేసి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.

సారంగపూర్‌: వరి పొలం గట్లపై గడ్డి కోస్తున్న యువకుడు మూర్చ వ్యాధితో మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన మొగలి రాము(28) మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం సాయంత్రం పశువుల మేతకోసం గడ్డి కోసుకుని వచ్చేందుకు గ్రామ శివారు వరిపొలాల వద్దకు వెళ్లాడు. పొలం గట్లపై గడ్డి కోస్తుండగా మూర్చవ్యాధి రావడంతో పక్కనే బురదలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాము కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతికారు. బుధవారం పంటపొలంలో పడి మృతిచెందినట్లు రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. భార్య రూప ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

తాంసి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాంసి ఆర్‌ఐ సంతోశ్‌ చికిత్సపొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్‌ మండలం కరంజి(టి) కి చెందిన ఎం.సంతోశ్‌(49) తాంసి తహసీల్దార్‌ కా ర్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 21న సొంత పని నిమిత్తం బైక్‌పై మహారాష్ట్రలోని యావత్మాల్‌కు వెళ్లాడు. తిరిగి వస్తుండగా పిప్పల్‌కోటి సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. సంతోశ్‌ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు అతన్ని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహన్ని మహారాష్ట్రలోకి పాండ్రకవడ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు కేసు నమోదు చేశారు. కరంజి(టి)లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చాక్‌పల్లికి చెందిన ఒకరు..

నర్సాపూర్‌(జి): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక రు మృతి చెందినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని చాక్‌పల్లికి చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (40) తన భార్య కౌసర్‌తో తరచూ గొడవపడేవాడు. భార్య రెండేళ్ల క్రితం ఇద్దరు కుమారులతో పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఇస్మాయిల్‌ మద్యం మత్తులో కిందపడడంతో చెవికి గాయమైంది. చికిత్స కోసం నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి మలన్‌ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement