లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లికి చెందిన కందుకూరి రాజేశ్వర్(54) బహ్రెయిన్‌లో గత ఫిబ్రవరి 26న గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయింది. మృతదేహాం స్వగ్రామానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోంది. స్వగ్రామానికి వెంటనే తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ కమిటీ రాష్ట్ర సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల ఇప్పటికే ప్రవాసీ భారతీయ సహాయత కేంద్ర్ (పి.బి.ఎస్.కే)కు ఈ–మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి మరోసారి వివరాలు పంపి ప్రయత్నాలు చేపట్టారు. అతడు కూలీగా పనిచేస్తున్న అర్దోస్ కాట్రాక్టింగ్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ, రాయబార కార్యాలయ అధికారులు దహన సంస్కారాలు బహ్రెయిన్‌లో చేయమని కుటుంబీకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ పుష్ప, రాష్ట్ర సభ్యులకు తెలుపగా బుధవారం స్వదేశ్, ఉప సర్పంచ్ విద్య సాగర్‌రెడ్డి, న్యాయవాది ఫసియొద్దీన్ కుటుంబ సభ్యులను కలిసి మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వదేశ్..ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్‌రెడ్డి ద్వారాసీఎం రేంవత్‌రెడ్డిని కలిసి విన్నవిస్తామని తెలిపారు.


