ఆదిలాబాద్‌రూరల్: ఢిల్లీలో నిర్వహిస్తున్న 10వ జాతీయ జనజాతి, లోక్ సంస్కృతి సాహిత్య ఉత్సవంలో బుధవారం మావల మండలం వాఘాపూర్‌కు చెందిన తొడసం కై లాష్ మాస్టర్ దేవనాగరి లిపిలో రాసిన పండోక్న మహాభారత్ కథ పుస్తకాన్ని కేంద్రమంత్రి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కై లాష్ మాట్లాడుతూ మహాభారతంలో తాను 2024లో తెలుగు లిపితో గోండిభాషలో ఈ పుస్తకాన్ని రచించి ప్రచురించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని కొందరు హిందీ లిపిలో రాస్తే మాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. రెండు నెలల్లో తెలుగు లిపిలో ఉన్న ఈ పండోక్న మహాభారత్ కథ పుస్తకాన్ని దేవనాగరి హిందీ లిపిలో కన్వర్ట్ చేసినట్లు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ పుస్తకం అందుబాటులో ఉందన్నారు. గోండిభాషలో అమెజాన్ విడుదలైన తొలి పుస్తకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్–కళానిధి విభాగం ఢిల్లీ, ఇంది రాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం భోపాల్‌తో సంయుక్తంగా కార్యక్రమం కొనసాగింది. జిల్లా రచయితలు డాక్టర్ మెస్రం మనోహర్, జాదవ్ ఇందల్ సింగ్, తొడసం దేవ్‌రావ్ పాల్గొన్నారు.


