● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్‌రావు, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసులు, పరిష్కారం బాధితులకు న్యాయం అంశాలపై సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ దండేపల్లిలోని పీవీ టీజీ, తాండూర్‌లో ఎస్టీ వసతిగృహాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నియోజవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అందరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. 2023 డిసెంబర్ వరకు నమోదైన అట్రాసిటీ కేసుల్లో బాధితులకు గత సంవత్సరం రూ.1.34 కోట్లు నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ 2025లో 117 అట్రాసిటీ కేసులు న మోదు అయ్యాయని, కేసుల పరిష్కారంలో సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపా రు. ఈ సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, కిరణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గప్రసాద్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నారాయణ, ఎల్లయ్య, రాజన్న, డీపీఆర్వో కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.


