● ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రామకృష్ణాపూర్: హైకోర్టు తీర్పును అనుసరించి క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా బుధవారం ఆమె రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను రెండుసార్లు వాయిదా వేయడం సరికాదని, ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్, తిరుపతిరెడ్డి, మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు.


