సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ప్రచార వాహనాన్ని రెడ్‌ కో ఆదిలాబాద్‌ డీఎం ఎల్‌.శ్రీనివాస్‌, టీజీ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ రాజన్న, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించి కరపత్రాలు ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గృహ విద్యుత్‌ వినియోగదారులు తమ ఇంట్లో రూఫ్‌ టాప్‌పై సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల 360 యూనిట్ల వరకు విద్యుత్‌ పొందవచ్చని తెలిపారు. 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ విద్యుత్‌కు రూ.78 వేలు రాయితీ నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తే నెట్‌ మీటరింగ్‌ ద్వారా డిస్కం నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. జాతీయ పో ర్టల్‌ www.pmsuryaghar.gov.in ద్వారా ద రఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్‌ డీఈ(మంచిర్యాల) డి.మల్లేశం, ఏడీఈ(కమర్షియల్‌) జి.మోహన్‌రెడ్డి, ఏడీఈ(మంచిర్యాల రూరల్‌) రాజశేఖర్‌, కలెక్టరేట్‌ ఏవో పిన్న రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయాలి

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రావుతో కలిసి పరిశీలించారు. 63, 163జీ జాతీయ రహదారుల ఏర్పాటులో జిల్లాలోని దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement