పంటల సాగులో ఆధునికతను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంటల సాగులో ఆధునికతను అందిపుచ్చుకోవాలి

Mar 25 2026 6:57 AM | Updated on Mar 25 2026 6:57 AM

బెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఆధునికతను అందిపుచ్చుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.యాకాద్రి అన్నారు. మంగళవారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో కిసాన్‌మేళా నిర్వహించారు. బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రసూన అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. హెచ్‌డీపీఎస్‌ పద్ధతిలో పత్తి సాగు చేస్తే ఉపయో గం ఉంటుందని తెలిపారు. సమగ్ర కీటక నియంత్రణ పద్ధతులు, యాసంగి వరిలో చలిని ఎదుర్కొనే నిర్వహణ విధానాలు, అనువైన వరి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఆర్‌ డాక్టర్‌ హరీ ష్‌కుమార్‌శర్మ మాట్లాడుతూ యాసంగి సీజన్‌కు అ నుకూలమైన శనగ, నువ్వు పంటల సాగు లాభదా యకంగా ఉంటుందని తెలిపారు. శనగ, నువ్వులు, ఆవాలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయాలని సూచించారు. పలు ప్రైవేట్‌ కంపెనీలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రగతి శీల రైతులకు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ మేళాలో జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ, శాస్త్రవేత్తలు రామ్‌గోపాల్‌వర్మ, శ్రీధర్‌చౌహాన్‌, వీర న్న, బి.శ్రీనివాస్‌, కేవీకే శాస్త్రవేత్తలు, ఏడీఏ రాజనరేందర్‌, ఏవో ప్రేమ్‌కుమార్‌, భారత్‌ అగ్రి కన్సల్టెన్సీ సీఈఓ వెంకటేష్‌, ఆర్‌ఏడబ్ల్యూఈ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement