మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి న బడ్జెట్ అన్ని వర్గాలను వంచించేలా ఉందని మా జీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బీసీలు, మైనార్టీలకు నిధులు కేటాయించలేదని, సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని తెలిపారు. మెడికల్ బోర్డు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించడం లేదని, ప్రారంభించిన వాటిని పూర్తి చే యడంలేదని విమర్శించారు. హైదరాబాద్ తరహా లోనే మంచి ర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూల్చివేతలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలు అ మలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించా రు. పార్టీ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, కార్పొరేటర్లు అబ్దు ల్ సత్తార్, పెట్టెం స్వరూప, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, సందెల వెంకటేశ్ తదితరులున్నారు.
‘విద్యారంగానికి అన్యాయం’
మంచిర్యాలఅర్బన్: విద్యారంగానికి బడ్జెట్ కేటా యింపులో తీవ్ర అన్యాయం జరిగిందని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన డీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లుల ప్రస్తావన లేకపోవటం విచారకరమని, సవరణ చేసి హామీ మేరకు 15శాతం నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, ఉపాధ్యక్షులు కుమార్, పత్తి సంతోష్, కార్యదర్శులు అప్పారావు, ప్రకాశ్, ఆడట్ కమిటీ సభ్యులు విష్ణువర్ధన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


