‘నాసిరకం భోజనం మాకొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘నాసిరకం భోజనం మాకొద్దు’

Mar 23 2026 8:55 AM | Updated on Mar 23 2026 8:55 AM

నెన్నెల: నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వి ద్యార్థులు ఆదివారం ప్రధాన గేటు ఎదుట ధర్నా చే శారు. వీరికి ఏఐఎస్‌బీ నాయకులు, సర్పంచ్‌ కొండగొర్ల గంగారాం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కనుకుంట్ల సన్నిగౌడ్‌, ఢీకొండ జతిన్‌గౌడ్‌ మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై అ ధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చి హాస్టల్‌ సమస్యలు బయటకు ఎందుకు తెస్తున్నారని వారిని బెదిరించారని ఆరోపించారు. నాణ్యత లేని భోజ నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని, మెడికల్‌ క్యాంపులు నిర్వహించ డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు రూ.75వేల గ్రాంట్‌ వస్తే ఎలాంటి పనులు చేపట్టలేదని, కనీస సౌకర్యాలు కానరావడం లేదని తెలిపా రు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో అబ్దుల్‌హై పాఠశాలకు చేరుకుని విద్యార్థుల సమస్య తెలుసుకుని సిబ్బందిని మందలించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే క లెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. డీటీడబ్ల్యూవో రమాదేవి, ఏటీడబ్ల్యూవో సురేశ్‌ ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడి సిబ్బందిపై చర్యలు తీ సుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఉపసర్పంచ్‌ బైరి సాయి, వార్డు సభ్యుడు దేవాజీ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement