‘ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి’

Mar 23 2026 8:55 AM | Updated on Mar 23 2026 8:55 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): రాజకీయాలకు అ తీతంగా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని రా ష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముత్తినేని వీర న్న పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిప ల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలోగల మంచిర్యాల గార్డెన్స్‌లో పెరిక ప్రజాప్రతినిధులను సన్మానించారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు లగిశెట్టి రాజన్న, బియ్యల త్రివేణి, పెట్టెం స్వరూప, ఎంబడి కుమారస్వామితో పాటు జిల్లాలోని పెరిక ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ.. కుల సంఘం బలోపేతమైతేనే భవి ష్యత్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశముంటుందని తెలిపారు. కులస్తులంతా ఏకతాటిపై కి వచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పి లుపునిచ్చారు. ఈ సందర్భంగా పెరిక యువత జి ల్లా అధ్యక్షుడిగా కారుకూరి మనోజ్‌, సంఘం మహిళా జిల్లా అధ్యక్షురాలిగా అత్తి సరోజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సుంకరి ఆనంద్‌, జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చుంచు రాజ్‌కిరణ్‌, కోశాధికారి నెల్కి మల్లేశ్‌, మంచిర్యాల నగర అధ్యక్షుడు బొడ్డు తిరుపతి, మంచిర్యాల ఏఎంసీ చైర్‌పర్సన్‌ పద్మ, నాయకులు డాక్టర్‌ రమణ, మురళి, సరోజ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement