సిర్పూర్(టి): మండలంలోని సిర్పూర్(టి) –కాగజ్‌నగర్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతాల్లో ఆదివారం కార్చిచ్చు ఏర్పడింది. దీంతో ప్రధాన రహదారి గుండా రోడ్డుకు ఇరువైపులా అంటుకున్న మంటల్లో చెట్లు దగ్ధమయ్యాయి. దీంతో పాటు కలప కూడా అగ్నికి ఆహుతైంది. కాగా ప్రధాన రహదారి గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
హరిత వనంలో..
దస్తురాబాద్: మండలంలోని దేవునిగూడెం గ్రా మ పంచాయతీలోని కేసీఆర్ హరిత వనంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిగూడెం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ఆనుకొని కేసీఆర్ హరిత వ నం ఉండటంతో రహదారిపై వెళ్లే గుర్తుతెలి యని వ్యక్తులు పొగతాగి అగ్గి వేయడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. వెంటనే అక్క డ ఉన్న వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో స్వల్ప మొక్కలు ధ్వంసమైనట్లు అటవీ క్షేత్రఅధికారిణి గీతారాణి తెలిపారు.


