రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బోథ్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పురుషోత్తం తె లిపిన వివరాల మేరకు బోథ్ మండలంలోని దన్నూర్ (బి) గ్రామానికి చెందిన దోపతి భూమయ్య కుమారుడు దోపతి సురేందర్ (33) మంగళవారం ఉదయం పని నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్లాడు. బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వా హనంపై ఆదిలాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ఘటనలో సురేందర్‌కు తీవ్ర గాయాలుకావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


