నేటి నుంచి రంజాన్
ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు ముస్తాబైన మసీదులు ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
నెన్నెల/ఉట్నూర్‌రూరల్: ముస్లింలు నెలరోజులపాటు చేపట్టే రంజాన్ ఉపవాసాలు ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక ద ర్శనంతో రాత్రి నుంచే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవా రుజాము నుంచి మొదటి ఉపవాస దీక్ష (రోజా)కు ముస్లింలు సిద్ధమయ్యారు. నమాజ్‌ల కోసం మసీదులను ముస్తాబు చేశారు. వేకువ జామున ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభించి సాయంత్ర ం దీక్ష విడిచే సమయం (ఇఫ్తార్)లో ప్రత్యేక వంటకాలను అందించడం కోసం హోట ళ్లు కూడా సిద్ధమయ్యాయి. 30 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు మళ్లీ సాయంత్రం విలీన గగనంలో నెలవంకను చూసి మరుసటి రోజు ఉదయాన్నే రంజాన్ పండుగను జరుపుకుంటారు. ‘షవ్వాల్’ నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్‌ను ‘ఈదుల్ ఫితర్’ అని అంటారు.
పవిత్ర మాసం
ఈ మాసంలో నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టతో ఉపవాసం ఉండటం, ఖురాన్ చదవడం, సంవత్సరంలో సంపాదించిన ఆదాయంలో ఫిత్ర, జాకాత్ బీద వారికి అందించడంలాంటి కార్యక్రమాలు ఈ పవిత్ర మాసంలో అధికంగా చేస్తుంటారు.
– హఫీజ్ మహ్మద్ మోయినొద్దీన్,
మతగురువు, ఉట్నూర్
అందరి పండుగ
రంజాన్ మాసంలో నియమ నిష్టలతో కఠోర దీక్షలు చేపడితే దేవుడు తన దగ్గరివాడిగా చేసుకుంటాడు. రంజాన్ నెలలో పని మనిషి యొక్క కష్టాలను యజమాని దూరం చేసినట్లయితే దేవుడు ఆయన తప్పులను క్షమిస్తాడు. ఏటా పండుగను ప్రతీ ఒక్కరు కలిసి మెలసి చేసుకోవడం ఆచారంగా వస్తోంది.
– రిజ్వాన్‌మౌలానా,
సఫాబైతుల్ మాల్ సంస్థ నిర్వాహకులు, ఉట్నూర్
ఆకలి బాధ తెలియజేస్తుంది
రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్ష ఆకలి బాధను తెలియజేస్తుంది. దీంతో పాటు జీవితంలో ఎదిగేందుకు ఓర్పు, సహనం, అలవాటు అవుతుంది. ఆహారం కోసం ఎన్నో కష్టాలు పడుతున్న వారి బాధలు ధనవంతులకు తెలియజేయాలన్నదే రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం. పండుగరోజు నమాజ్‌కు ముందే ప్రతిఒక్కరూ రెండున్నర కిలోల నాణ్యమైన గోధుమలు పేదలకు దానం చేయాలి.
– షహైర్ హైమద్, మతగురువు, నెన్నెల
నేటి నుంచి రంజాన్
నేటి నుంచి రంజాన్
నేటి నుంచి రంజాన్


