ఆ మలుపులు.. ప్రమాదాలకు నెలవులు | - | Sakshi
Sakshi News home page

ఆ మలుపులు.. ప్రమాదాలకు నెలవులు

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

ఆ మలు

ఆ మలుపులు.. ప్రమాదాలకు నెలవులు

విఠల్‌నగర్‌ వద్ద మూలమలుపు

రామకృష్ణాపూర్‌: రామకృష్ణాపూర్‌–మంచిర్యాల ప్రధాన రహదారిలో ప్రమాదకర మూలమలుపులు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. కేవలం కిలోమీటర్‌ మేర ఉన్న రామకృష్ణాపూర్‌ విఠల్‌నగర్‌ నుంచి క్యాతనపల్లి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వరకు ఉన్న రెండు మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. విఠల్‌నగర్‌, ఫ్లైఓవర్‌ సమీపంలో ఎదురెదురుగా వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు బస్సులు లేదా భారీ వాహనాలు ఎదురైతే ఒకటి రోడ్డుకిందకు దిగక తప్పని పరిస్థితి. అది ఎంత ఇరుకు రోడ్డో అర్థం చేసుకోవచ్చు. క్యాతనపల్లి పంచాయతీగా ఉన్నప్పుడు రోడ్డు వెడల్పే ఇప్పుడు కూడా ఉందంటే అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. రామకృష్ణాపూర్‌–మంచిర్యాలకు ఉన్న ఏకై క ఈమార్గంలో నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. మూలమలుపులు, ఇరుకు రోడ్డు కారణంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. క్యాతనపల్లి నూతన ఫ్లై ఓవర్‌ నుంచి విఠల్‌నగర్‌ జయశంకర్‌ విగ్రహం వరకు, అలాగే జయశంకర్‌ విగ్రహం నుంచి బీజోన్‌ వరకు విస్తరణ ప్రతిపాదనలు కొన్నాళ్లుగా ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిధులు మంజూరయ్యాయని ప్రకటించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.

ఆ మలుపులు.. ప్రమాదాలకు నెలవులు1
1/1

ఆ మలుపులు.. ప్రమాదాలకు నెలవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement