తాళ్లపేట్ రేంజ్‌లో పులి పాదముద్రలు గుర్తింపు
● నేటితో ముగియనున్న పులుల గణన
జన్నారం/దండేపల్లి: ఈ నెల 20న ప్రారంభమైన జాతీయ పులుల గణన నేటితో ముగియనుంది. ఎఫ్‌డీవో రామ్మోహన్ పర్యవేక్షణలో జన్నారం అటవీ డివిజన్‌లోని 40 అటవీబీట్‌లలో 86 మంది సిబ్బంది గణన చేస్తున్నారు. 20, 21, 22 తేదీలలో శాకాహార జంతువులు, 23 నుంచి 25 వరకు మాంసాహార జంతుగణన నిర్వహిస్తున్నారు. శనివారం దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ చింతపల్లి ఈస్ట్, పాతమామిడిపల్లి బీట్‌లలో పరిశీలించి పులి పాదముద్రలు గుర్తించారు. రోజువారీగా చేస్తున్న జంతుగణన వివరాలను ఎంస్ట్రైబ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపే ట రేంజ్ అధికారులు లక్ష్మీనారాయణ, సుష్మరావు, కే.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


