బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమిలేదు
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమిలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ మూడో కొడుకునని చెప్పుకునే సుమన్ ఈ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. పట్టణంలోని బీజోన్ మార్కెట్ ఏరియాలో వీధి వ్యాపారుల సౌకర్యార్థం నిర్మించిన మార్కెట్ ప్రాంగణాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.120 కోట్లు వెచ్చించామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, గోపతి రాజయ్య, వొడ్నాల శ్రీనివా స్, యాకూబ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల పాత్ర కీలకం
చెన్నూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులతో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారి, తదితరులు పాల్గొన్నారు.


