వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్‌లో భాగంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.16.24 లక్షల సబ్సిడీపై రైతులకు 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్పేయర్లు, 16 బ్రష్ కట్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, ఆత్మ బీఎఫ్‌ఏసీ చైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఎం.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


