మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు
మంచిర్యాలఅర్బన్: మేడారం మహా జాతరకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1వరకు ప్రత్యేక బ స్సులు నడపనుంది. మంచిర్యా ల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూర్‌తో పా టు ఆసిఫాబాద్ నుంచి బ స్సు సర్వీసులు నడిపేందు కు ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జా తరతో ఆదాయం సమకుర్చుకోవాలని ఆర్టీసీ సంస్థ యోచిస్తోంది. సింగరేణి కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లా నుంచే భక్తులు అధికంగా జాతరకు వెళ్లివస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా డిపోల పరిధిలోని బస్సులు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆరు పాయింట్ల నుంచి బస్సు సర్వీసులు నడిపించనున్నారు.
ఈ ఏడాది పెరిగిన బస్సులు..
వన దేవతల జాతరకు ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతూ వస్తోంది. మంచిర్యాల, కుమురంభీం జిల్లా నుంచే 2020లో 304, 2022లో 320, 2024లో 365, ప్రస్తుతం 369 బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయనున్నారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, రామక్రిష్ణాపూర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు.
ఆయా పాయింట్ల నుంచి బస్సులు ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 369 బస్సులు నడపనున్నారు. మంచిర్యాల డిపోకు చెందిన 115 బ స్సులు మంచిర్యాల బస్‌స్టేషన్ నుంచి నడిపించనున్నారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన 70, చెన్నూర్ పాయింట్ నుంచి, ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులు ఆసిఫాబాద్ 10, బెల్లంపల్లి పాయింట్ నుంచి 79 బస్సులు, భైంసాకు చెంది న 45 బస్సులను శ్రీరాంపూర్ పాయింట్‌కు, నిర్మల్ డిపోకు చెందిన 50 బస్సులను మందమర్రి పాయింట్‌కు కేటాయించారు. జాతరకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల భారం మోపింది. దాదాపుగా రూ.30 నుంచి రూ.40 టికెట్ చార్జీలు పెంచింది.
టికెట్ చార్జీలు ఇలా
బస్‌పాయింట్ బస్సులు పెద్దలకు
చెన్నూర్ 70 రూ.450
శ్రీరాంపూర్ 45 రూ.430
మందమర్రి 50 రూ.470
మంచిర్యాల 115 రూ.440
బెల్లంపల్లి 79 రూ.520
ఆసిఫాబాద్ 10 రూ.590
మహిళలకు ఉచిత ప్రయాణం..
ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించారు. ప్రతీ మహిళ తప్పనిసరిగా అప్‌డేట్ చేసిన ఆధార్‌కార్డు, ప్రభుత్వం గుర్తింపుకార్డు చూపిస్తే అవకాశం కల్పిస్తున్నారు.


