● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక్సిడెంట్స్‌ రికార్డు ● ఆదర్శంగా నిలుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు | - | Sakshi
Sakshi News home page

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక్సిడెంట్స్‌ రికార్డు ● ఆదర్శంగా నిలుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

● దశా

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక్సిడెంట్స్‌ రికార్డు ● ఆదర్శంగా నిలుస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు

మనస్సును

నియంత్రించుకోవాలి..

నేను 1994లో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదరహితంగా బస్సును నడుపుతున్నాను. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత డ్రైవింగ్‌పై మాత్రమే దృష్టి సారించాలి. అప్పుడే వాహనం మన పూర్తి నియంత్రణలో ఉంటుంది. భావోద్వేగాలు లేకుండా, ఓపికతో మన మనస్సును నియంత్రించుకోవాలి. మూడు దశాబ్దాల నా విధి నిర్వహణలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఈ లక్షణమే నాకు మంచి డ్రైవర్‌ అనే గుర్తింపునిచ్చింది.

– ఎండి. యూసుఫ్‌, మంచిర్యాల డిపో

తొందరపాటే ప్రమాదాలకు

కారణం..

నేను 1991లో ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు లేకుండా నడపడానికి ప్రధాన కారణం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. ఈ రోజుల్లో వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ వేగంగా వెళ్తున్నారు. ఈ తొందరపాటుతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని బస్సును నడిపితే ప్రయాణికులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇదే విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని నేను డ్రైవింగ్‌ చేస్తాను.

– జి. గబ్బర్‌ సింగ్‌, ఉట్నూర్‌ డిపో

ఆ చేతిలో స్టీరింగ్‌.. సురక్షితం

ఆదిలాబాద్‌: రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యమైన ఈ రోజుల్లో దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వారు మాత్రం ప్రమాదాలకు దూరంగా ఉంటున్నారు. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డ్రైవింగ్‌ అంటే ఉద్యోగం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన కర్తవ్యం అని పునఃనిర్వచిస్తున్నారు. ఉద్యోగంలో చేరింది మొదలు, ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అప్రమత్తంగా వాహనాన్ని నడిపి డ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి వారిలో కొందరిపై ఓ లుక్కెద్దామా మరి.

అన్నింటినీ గమనించాలి..

నేను ఉద్యోగంలో చేరి 31 సంవత్సరాలు దాటింది. డ్యూటీ ఎక్కగానే ముందుగా బస్సుకు సంబంధించిన అన్ని భాగాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకుంటాను. స్టీరింగ్‌ మీదికి వచ్చిన తర్వాత మరోసారి కండిషన్‌ చెక్‌ చేసుకుంటాను. రోడ్డు పైకి వెళ్లగానే మన వాహనాన్ని కాకుండా చుట్టూ ఉన్న అన్ని వాహనాల వేగం కదలికలను గమనిస్తూ ఉండాలి. అదే సమయంలో భద్రతా నియమాలు పాటించాలి. అప్పుడే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఇతర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. – జి. మణి, మంచిర్యాల డిపో

తల్లి ఒడిలా భావిస్తా..

2016లో ఉద్యోగంలో చేరాను. ఆర్టీసీ ప్రయాణం సుఖప్రదం– సురక్షితం అనే సంస్థ నినాదాన్ని పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నా. క్రమశిక్షణగా, ఏకాగ్రతతో నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. బస్సు స్టీరింగ్‌ పట్టింది మొదలు నేను చేసే ఉద్యోగాన్ని బతుకుదెరువుగా కాకుండా, బాధ్యతగా అనుకుంటాను. బస్సును తల్లి ఒడిలా భావించి, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.

– భాస్కర్‌, ఆసిఫాబాద్‌ డిపో

కుటుంబ సభ్యులుగా భావించి నడపాలి

30 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా బస్సును నడిపాను. ఒత్తిడి లేకుండా వాహనాన్ని నడిపితే, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. మన కుటుంబ సభ్యులను ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్తామో, అంతే బాధ్యతాయుతంగా ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లాలి. అప్పుడే మన ఉద్యోగానికి తగ్గిన గౌరవం, సార్థకత లభిస్తుంది.

– హన్మంతు, ఆసిఫాబాద్‌ డిపో

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక1
1/5

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక2
2/5

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక3
3/5

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక4
4/5

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక5
5/5

● దశాబ్దాలుగా బాధ్యతాయుత డ్రైవింగ్‌ ● కెరియర్‌లో నో యాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement