బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: బాలికలు విద్యతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ బాలికలు ప్రతీ విషయంలో నైపుణ్యం పెంపొందించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు. బేటీ బచావో– బేటీ పడావో ప్రతిజ్ఞ చేశారు. చదువుతో పాటు క్రీడలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన బాలికలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దు ర్గాప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్‌లతో కలిసి హాజరయ్యారు. సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


