శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించిన వారు ఎంతటివారైనా రాజీపడేది లేదని మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రామగుండం పోలీసు కమిషనరేట్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆర్మ్‌డ్ సాయుధ దళ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్ర త ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వి వరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు ఇంటెలిజెన్స్, ఇన్‌ఫార్మర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. అనంతరం కమిషనరేట్ ఆవరణలో నివాస గృహాల నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. నిర్ధిష్ట గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.


