ఆరుసార్లు ఓట్ల లెక్కింపు..
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామంలో బుధవారం ఆరుసార్లు ఓట్ల లెక్కింపు నిర్వహించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు నరేశ్‌పై స్వతంత్ర అభ్యర్థి రాము 15ఓట్ల తేడాతో గెలుపొందాడు. నరేశ్ రీకౌంటింగ్ కోరగా అధికారులు ఆరుమార్లు లెక్కించారు. ప్రతీసారి రాము ఓట్లు తగ్గుతూ రాగా.. చివరికి నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ఇరువర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి రాముకు సంబంధించిన వ్యక్తులు ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాల రికార్డులతో మరోమారు కౌంటింగ్ నిర్వహించి ఎట్టకేలకు రాము రెండు ఓట్లతో గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు.


