నేడు డయల్ యువర్ డీఎం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఈ నెల 18న డయల్ యువర్ ఆర్టీసీ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరణ, పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆర్టీసీ..అసౌకర్యాల ప్ర యాణం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీ ఎం స్పందించారు. డిపో పరిధిలో నడిచే బ స్సుల సమయాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రజలు 9959226004 నంబరులో తమ అభిప్రాయాలను తెలియజేయాలని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


