అలా వచ్చి.. ఇలా వెళ్తున్నారు..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్(ఎస్‌ఈ) పోస్టు కుర్చీలాటగా మారింది. ఏడాదిన్నర కాలంలో నలుగురు ఎస్‌ఈలు బది లీ కావడం చర్చనీయాంశమైంది. జిల్లాకు వస్తున్న అధికారులు ఆరు నెలలు దాటకుండానే బదిలీపై వె ళ్తున్నారు. గత జూన్ 26న బదిలీపై జిల్లాకు వచ్చిన ఎస్‌ఈ ఉత్తమ్ జాడే ఈ నెల 24న బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని డీఈ రాజన్నకు పదోన్నతి కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఉత్తమ్ జాడే ఆరు నెలలు గడువక ముందే బదిలీ అయ్యారు. స్థానిక సమస్యల కారణంగానే కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. రాజన్న ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాకు బదిలీ కాగా.. తన పలుకుబడితో జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. ఉత్తమ్‌జాడే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లడానికి నిరాకరించడంతో ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు.
గత మే నుంచి నలుగురు.
బదిలీపై వచ్చే అధికారులు రెండు మూడేళ్లు పని చే యాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో నెలల వ్యవధిలో నే వెళ్లిపోతున్నారు. అక్రమాలు, అవినీతి ఫిర్యాదులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం తదితర ఆ రోపణల నేపథ్యంలో ఇక్కడ ఉండేందుకు జంకుతున్నారు. గత ఏడాది మే వరకు విధుల్లో ఉన్న ఆర్.శేషారావును విధుల్లో నిర్లక్ష్యం, పలు ఆరోపణల ఫి ర్యాదులతో బదిలీ చేశారు. ఆయన స్థానంలో కా ర్పొరేట్ కార్యాలయంలోని ఎస్‌ఈ ఎస్.శ్రావణ్‌కుమార్‌ను కేటాయించగా.. ఇక్కడి సమస్యలు, అధికా రులు తీరు ముందే గ్రహించి రావడానికి వెనుకడు గు వేశారు. కొద్ది రోజులు డీఈ రాజన్నకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన శ్రావణ్‌కుమార్ కొద్ది నెలల సమయంలోనే విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సా రించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందిని విధుల్లో పరుగులు పెట్టించారు. సమావేశాలు, సమీక్షలు నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వ హించిన వారిని హెచ్చరించారు. ఆరోపణల ఏఈని సస్పెండ్ చేశారు. జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, ఆరోపణలు తలకు మించిన భారంగా మార డం, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు ప్రమేయం అధికంగా ఉండడంతో తన కార్పొరేట్ కార్యాలయ పలుకుబడితో గత నవంబర్ 6న ఇతర జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. ఆయన స్థానంలో కరీంనగర్ ఎస్‌ఈ గంగాధర్‌ను కేటాయించగా.. జిల్లాకు వచ్చేందుకు ససేమిరా అన్నారు. మళ్లీ కొద్ది రోజులు డీఈ రాజన్న ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇతర జిల్లాకు బదిలీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక వారం రోజుల తర్వాత గంగాధర్ విధుల్లో చేరారు. ఆయన స్థానికంగా ఉండకపోవడం, సమస్యలపై దృష్టి సారించకపోవడం, డివిజన్ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఇష్టారాజ్యం కొనసాగింది. ఎట్టకేలకు గంగాధర్ గత జూన్ 26న పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన ఉత్తమ్ జాడే ఐదు నెలల వ్యవధిలోనే వెళ్లిపోయారు. దీంతో మళ్లీ రాజన్నను నియమించారు.
సమస్యలు.. నిర్లక్ష్యం..
జిల్లాలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోంది. ఎ స్‌ఈ ఆదేశాలు పట్టించుకోకపోవడం, యూనియ న్లు, ప్రజాప్రతినిధుల జోక్యం పెరిగిపోవడం కారణంగా ఇక్కడ పని చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. స్థానికంగా స్థిరపడిన డీఈలు, ఏడీఈలు, ఏ ఈలు ఏళ్ల తరబడి ఇటు నుంచి అటు నుంచి బదిలీ అవుతూ పైరవీలతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎస్‌ఈ, ఉన్నతాధికారుల ఆదేశాలు లెక్క చేయడం లేదు. విద్యుత్ సమస్యలు పెరిగిపోయి వినియోగదారులు గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సమస్యలను చక్కదిద్తే ప్రయత్నం చేసేలోపే ఎస్‌ఈలు బదిలీ అవుతున్నారు.


