భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణం
నస్పూర్: భారత రాజ్యాంగం దేశానికి గర్వకారణమని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం(సంవిధాన్ దివస్)ను పురస్కరించుకుని నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ముందుమాట ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా వైద్యాధికారి అనిత, మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


