హాజీపూర్ మండలంలో 12 గ్రామ పంచాయతీలను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. మొదటి కస్టర్ గఢ్‌పూర్ గ్రామ పంచాయతీలో గఢ్‌పూర్, ర్యాలీ, నాగారం, చిన్నగోపాల్‌పూర్, 2వ క్లస్టర్ హాజీపూర్‌లో రాపల్లి, హాజీపూర్, టీకానపల్లి, 3వ క్లస్టర్ దొనబండలో దొనబండ, పెద్దంపేట, నాలుగో క్లస్టర్ కర్ణమామిడిలో కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు.
జన్నారం మండలంలో 29 గ్రామ పంచాయతీలకు ఎనిమిది నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చింతగూడలో చింతగూడ, రోటిగూడ, మల్యాల, మహ్మదాబాద్, పొనకల్‌లో జన్నారం, పొనకల్, ధర్మారం, బాదంపల్లిలో చింతలపల్లి, లింగయ్య, బాదంపల్లి, మురిమడుగులో కలమడుగు, వెంకటపూర్, మురిమడుగు, కిష్టాపూర్‌లో కిష్టాపూర్, దేవునిగూడ, లోతొర్రే, కామన్‌పల్లి, కవ్వాల్‌లో హాస్టల్ తండా, బంగారుతండా, కొత్తపేట్, కవ్వాల్, తపాలపూర్‌లో సింగరాయిపేట్, తిమ్మాపూర్, రాంపూర్, తపాలపూర్, ఇందన్‌పల్లిలో రేండ్లగూడ, మొర్రిగూడ, టీజీపల్లి, ఇందన్‌పల్లి గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తామని ఎంపీడీవో తెలిపారు.
లక్సెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో నా మినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై ఎంపీడీవో స రోజ, తహసీల్దార్ దిలీప్‌కుమార్ బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. 18 గ్రామాలకు ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేశా రు. మొదటి క్లస్టర్ చందారంలో హన్మంతుపల్లి, రంగపేట, 2వ క్లస్టర్ దౌడపల్లిలో పాత కొ మ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం, 3వ క్లస్టర్ గుల్లకోటలో మిట్టపల్లి, సూరారం, 4వ క్లస్టర్ జెండావెంకటాపూర్‌లో బలరావుపేట, తిమా ్మపూర్, 5వ క్లస్టర్ పోతపల్లిలో అంకతిపల్లి, లక్ష్మిపూర్, 6వ క్లస్టర్ వెంకట్రావుపేటలో ఎ ల్లారం, కొత్తూరు నామినేషన్లు స్వీకరిస్తారు.
దండేపల్లి మండలంలోని 31 గ్రామాలను 10 క్లస్టర్లుగా విభజించినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. తాళ్లపేటలో నాగసముద్రం, మా కులపేట, తాళ్లపేట, రాజుగూడ, లింగాపూర్‌లో గుడిరేవు, అల్లీపూర్, లింగాపూర్, పెద్దపేటలో లక్ష్మీకాంతపూర్, వెల్గనూర్‌లో కాసిపే ట, వెల్గనూర్, ద్వారకలో కొండాపూర్, ధర్మరావ్‌పేట, ద్వారక, దండేపల్లిలో కర్ణపేట, న ర్సాపూర్, దండేపల్లి, కొర్విచెల్మలో ముత్యంపేట, రెబ్బనపల్లి, చెల్కగూడ, గూడెంలో క న్నెపల్లి, నంబాల, గూడెం, నెల్కివెంకటాపూర్‌లో వందుర్‌గూడ, చింతపల్లి, తానిమడు గు, నెల్కివెంకటాపూర్, మ్యాదరిపేటలో మా మిడిపల్లి, కొత్తమామిడిపల్లి, మ్యాదరిపేట గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తారు.
గఢ్‌పూర్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలిస్తున్న తహసీల్దార్ శ్రీనివాసరావు
లక్సెట్టిపేట: నామినేషన్ క్లస్టర్ వివరాలను నోటీసు బోర్డుపై అతికిస్తున్న ఎంపీడీవో సరోజ
దండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/జన్నారం: జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభం కానుంది. ఇందుకోసం మండలాల్లోని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా కేంద్రాలను తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీఎల్‌పీఓలు, కార్యదర్శులు, పోలీస్ శాఖ అధికారులు సందర్శించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయించారు.
నామినేషన్లకు వేళాయె..


