నూతన సర్కిల్‌గా ‘జైపూర్’
జైపూర్: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జైపూర్ పట్టణాన్ని నూతన సర్కిల్‌గా ఏర్పాటు చేస్తూ పోలీస్‌స్టేషన్‌కు కొత్తగా సీఐని నియమిస్తూ ఆశాఖ ఉన్నతాధికారులు శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు, మరోవైపు వరంగల్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేలతో జైపూర్ పట్టణప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగా సర్కిల్ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదన పంపించారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్‌లో సైబర్‌క్రైంలో విధులు నిర్వర్తిస్తున్న కె.నవీన్‌కుమార్‌ను జైపూర్ సీఐగా నియమిస్తూ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జైపూర్ కేంద్రంగా ఇప్పటికే అసిస్టెంట్ కమిషనరేట్‌గా ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు.


