శ్రీరాంపూర్: ఈ నెల 30న ‘ప్రగతి స్టేడియం పిలు స్తోంది రా’ పేరుతో క్రీడాకారులు, కళాకారుల ఆత్మీ య సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ వై.యాదిరెడ్డి, ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్రపాణి, కో కన్వీనర్ ఇసంపల్లి రామచందర్ తెలిపారు. శనివారం నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12, 1992లో ప్రగతి మైదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతనే ప్రగతి మైదానం క్రీడాకారులకు దక్కిందన్నారు. ఈ మైదానంలో ఎంతోమంది కంపెనీ క్రీడాకారులు క్రీడల్లో ప్రావీణ్యం సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారన్నారు. సుమారు 250 మంది కార్మికుల పిల్లలు ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలు సాధించారన్నారు. మైదానంలో ఆడిన క్రీడాకారులు, సీఈఆర్ క్లబ్ వేదికగా కళా ప్రదర్శనలిచ్చిన కళాకారులతో పాటు వారికి సహకరించిన అధికారులతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌తో పాటు నాటి కంపెనీ డైరెక్టర్లు, జీఎంలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి ఎద్దు సదయ్య, భాను ప్రసాద్, భాస్కర్ రాజేశం, రాళ్ల బండి రాజన్న, శ్యాంసుందర్, గజెల్లి రాయలింగు, పుల్లయ్య, దమ్మాల శ్రీని వాస్, మైసూర్, మహేందర్, శేషగిరి, కాశి సతీష్, కార్తీక్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


