వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
మంచిర్యాలటౌన్: వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, వారి హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వృద్ధులతో కలిసి వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులన్నారు. వారి జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి తమ పిల్లలకు మార్గదర్శకాలు సూచిస్తారన్నారు. ఈ నెల 21న పోలీస్, సంక్షేమ శాఖల సమన్వయంతో వయోవృద్ధులకు హక్కులు, చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిమోనియా నివారణకు చర్యలు
నస్పూర్: జిల్లాలో నిమోనియా నివారణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వై ద్యాధికారి అనిత, ఉపవైద్యాధికారి సుధాకర్‌నా యక్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమోనియా వ్యాధి బ్యాక్టిరియా, వైరస్‌ల కారణంగా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్‌ఫెక్షన్ అన్నారు. చలికాలంలో పిల ్లలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
రైతులకు సకాలంలో సేవలందించాలి
నస్పూర్: రైతులకు పంటల సాగు నుంచి కొనుగోలు వరకు సేవలు సకాలంలో అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025–26 యాసంగికి సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 1.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం నివేదికలు అందజేయాలన్నారు. పంట సాగులో డ్రోన్ వినియోగంపై క్రాప్ క్రాప్ట్స్ ఇన్నోవేషన్స్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, తదితరులు పాల్గొన్నారు.


