రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: ఆదిలాబాద్‌లో ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి క్రికెట్ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు అకాడమీ బాధ్యులు వెంకటేశ్వర్లు, శేఖర్ శనివారం తెలిపారు. అండర్–19 విభాగంలో తోట పున్నంచంద్రు, దుర్గం రోహిత్, గుమాల వినీల్ ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. అండర్–17 విభాగంలో కే.హర్ష, ఆర్.ప్రీతమ్, అండర్–14 విభాగంలో ఎస్.సాగమోహిత్, సీహెచ్ భువన్, ఎం.విహాన్ ఎంపికయ్యారని, ఆదిలాబాద్‌లో జరుగనున్న జోనల్‌స్థాయి క్రికెట్ పోటీల్లో ఆడనున్నట్లు తెలిపారు.


