అప్పీల్‌లేని అంతిమ తీర్పు
మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్‌లో పరిష్కరించబడిన కేసుల్లో కక్షిదారులు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశంలేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7 లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేసి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 1,876 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నిర్మల, న్యాయమూర్తులు కే.నిరోష, కవిత, తదితరులు పాల్గొన్నారు.
లక్సెట్టిపేట: రాజీమార్గమే రాజమార్గమని జూనియర్ సివిల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి కె.సాయికిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు వృథా చేసుకోవద్దన్నారు. చిన్నచిన్న తగాదాలతో కేసులు పెట్టుకుని కోర్టులు, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగవద్దన్నారు. ఈ సందర్భంగా మొత్తం 400 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాండ్ల సత్యనారాయణ, కార్యదర్శి ప్రదీప్‌కుమార్, న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, కొమిరెడ్డి సత్తన్న, కారుకూరి సురేందర్, రవీందర్, పద్మ, సత్యం, ప్రకాశం, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
335 కేసులు పరిష్కారం
చెన్నూర్: పట్టణంలోని సివిల్‌కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో డ్రంకెన్ డ్రైవ్, పట్టణ న్యూసెన్స్‌కు సంబంధించి 273 కేసులకు రూ.1,91,780 జరిమానా విధించినట్లు మేజిస్ట్రేట్ పర్వతపు రవి తెలి పారు. బ్యాంక్‌లకు సంబంధించిన 18 కేసులు పరిష్కారంకాగా ఖాతాదారులచేత రూ.9,85,000 బకాయిలు కట్టించామన్నారు. 42 క్రిమినల్ కేసులు , 2 సివిల్ కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.


