వెదురు కళాత్మక వస్తువుల తయారీతో ఉపాధి
జన్నారం: వెదురుతో కళాత్మక, అధునాతన వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందాలని తహసీల్దార్ రాజా మనోహర్‌రెడ్డి, టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ సొసైటీ కో ఫౌండర్ ఇమ్రాన్ సిద్దిఖీ సూచించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అక్సెంచర్ మరియు ఈడీఐఐ సహకారంతో శుక్రవారం ఇందనపల్లి గ్రామ పంచాయతీలోని నాయికపోడ్ గూడెంలో మహిళలకు ఏర్పాటు చేసిన వెదురు బొంగులతో అధునాతన కళాకృతుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెదురుతో తయారుచేసే వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవాసంస్థల కన్సల్టెంట్ చంద్రమోహన్, శిక్షణా కేంద్ర అక్సెంచర్ మరియు ఈడీఐఐ మాస్టర్ ట్రైనర్ దేవేందర్, ట్రైనర్ మాస్టర్ చంద్రమౌళి, మూతి రాజేందర్, గుజిగంటి ప్రకాష్, రాయ గణేష్, ముడితే శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.


