మిల్లుల్లో అధికారుల పరిశీలన
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) కోసం పౌరసరఫరాల శాఖ అనుమతికి దరఖాస్తు చేసుకున్న మూడు మిల్లులను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీ లించారు. మిల్లుల్లో యంత్రాలు, సాంకేతికత, నిల్వ సామర్థ్యంతోపాటు గతంలో సీఎంఆర్ బకాయిలు ఉండడం, ఇతర చోట్ల ఉన్న మిల్లు ల పనితీరును నివేదికలో పొందుపర్చారు. దండేపల్లి మండలం లింగాపూర్‌లోని శ్రీ క్రిష్ణా ఆగ్రో ఇండస్ట్రీస్, లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌లోని శివసాయి రైస్‌మి ల్, నస్పూర్ పరిధి తీగల్‌పహాడ్‌లోని రామాంజనేయ మాడ్రన్ రైస్ మిల్లుల్లో ఉమ్మడి నిజా మాబాద్, ఆదిలాబాద్ ఎన్‌ఫోర్స్ అధికారులు పరిశీలన చేశారు. ఆయా పరిమితుల మేరకు వచ్చే సీజన్ నుంచి ధాన్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఈ మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వనున్నారు.


