ముగిసిన కంపెనీస్థాయి సాంస్కృతిక పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈ ఆర్ క్లబ్ ఆవరణలో రెండు రోజులు కొనసాగిన కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు బుధవారం ము గిశాయి. ఈ పోటీల్లో సింగరేణిలోని ఆయా ఏరియా నుంచి వచ్చిన కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. మందమర్రి –బెల్లంపల్లి ఏరియా జట్టు ప్రదర్శించిన ఫోక్ డ్యాన్స్ మొదటి బహుమతి గెలుచుకోగా, సింగరేణి నుంచి కోలిండియా పోటీలకు ఎంపికై నట్లు డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ కమిటీ ప్రకటించింది. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు ఏరియా జీఎం రాధాకృష్ణ బహుమతుల ప్రదానం చేశారు. జీఎం మాట్లాడుతూ ఏ పోటీల్లోనైనా గెలుపోటములు సహజమన్నారు. ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఏరియా గౌరవ కార్యదర్శి కార్తీక్, ఆయా ఏరియాల క్రీడల సూపర్‌వైజర్స్ జాన్‌వెస్లీ, సీహెచ్ అశోక్, హెచ్. రమేశ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఆయా ఏరియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్, యూనియన్ల ప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు ఉన్నారు.
ముగిసిన కంపెనీస్థాయి సాంస్కృతిక పోటీలు


