రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బేల: మండల కేంద్రంలోని గణేశ్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు బావునే శ్రీకాంత్(28) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దాబాల వైపు నుంచి బేల వైపునకు ద్విచక్ర వాహనంపై శ్రీకాంత్ వస్తున్నాడు. బేల నుంచి డోప్టాల వైపునకు మరో ద్విచక్రవాహనంపై డోప్టాలకు చెందిన అంకత్ గజానన్, లాండసాంగ్వికి చెందిన అంకత్ గణేశ్‌లు వెళ్తున్నారు. గణేశ్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. బేలకు చెందిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.


