పరారీలో ఉన్న నిందితుల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాళ్లగురిజాల ఎస్సై బి. రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత సెప్టెంబర్ 6వ తేదీ, రాత్రి 11.30 గంటలకు బుధాకలాన్ గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతున్న క్రమంలో గొడవ జరుగుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదు అందిందన్నారు. పోలీసు సిబ్బంది శివ శంకర్, శివకృష్ణలు అక్కడికి చేరుకొని సర్ధి చెబుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన చింతకుంట్ల గణేశ్, చింతకుంట్ల మహేశ్‌లు పోలీసులను అడ్డుకుని దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. తాజాగా బుధవారం గ్రామంలో తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు. సిబ్బంది అశోక్, శివకృష్ణ పాల్గొన్నారు.


