‘కలప అక్రమ తరలింపునకు అడ్డుకట్ట’
జన్నారం: రాత్రిపూట కలప అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం జన్నారం డివిజన్ ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలోని కామన్‌పల్లి గ్రామ ప్రధానకాలువ వద్ద చెక్‌పోస్టును సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఎఫ్‌డీవో మాట్లాడుతూ చెక్‌పోస్టు వద్ద రాత్రి, పగలు ఉండేలా సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. రాత్రివేళ చెక్‌పోస్టులతో పాటు పెట్రోలింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా కలప తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడవుల రక్షణకు గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని కోరా రు. ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, జన్నారం ఇన్‌చార్జి రేంజ్ అధికారి మ మత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రియాజోద్దీన్, నాయకులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


