ఆపరేటర్ లేక కరెంట్ తిప్పలు!
చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు బేల మండలం సిర్సన్న గ్రామంలో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. విద్యుత్ సరఫరా పర్యవేక్షించే ఆపరేటర్ లేకపోవడంతో గతేడాది కాలంగా సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగలేదు. సిర్సన్న గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టడంతో ఇటీవల కేవలం ఆ ఒక్క గ్రామానికే సింగిల్ ఫేజ్‌తో కూడిన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. మిగితా గ్రామాలకు మాత్రం ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సబ్‌స్టేషన్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తే పది గ్రామాలకు త్రీఫేజ్‌తో కూడిన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


