అమ్మవారికి పూలు, పండ్లు సమర్పణ
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు బుధవారం మూడోరోజుకు చేరుకున్నాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి వేదపండితులు చంద్రశేఖరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ఫల పుష్పాధివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిత్యనిధి ఛండీహోమం, సహస్రకళశాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి ప్ర త్యేక భజన భృందం ఆధ్వర్యంలో కళాకారుల భజ న, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహించారు. పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమ్మవారికి పూలు, పండ్లు సమర్పణ


