పోలీసు స్టేషన్ నుంచి నిందితుడు పరార్
రెబ్బెన(ఆసిఫాబాద్): మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుడు పోలీసు స్టేషన్ నుంచి పరారైన ఘటన కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంత్‌రావు(50)ను మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అ దే గ్రామానికి చెందిన రాయిసిడాం వినోద్ శని వారం రాత్రి గొడ్డలితో దారుణంగా నరికి చంపా డు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి తరలించారు. సోమవారం రాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన వినోద్ వెంట ఉన్న పోలీసును తోసేసి పారిపోయాడు. తక్షణమే స్పందించిన పోలీసులు నిందితు డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రాత్రిపూట కావడంతో అతడి జాడ చిక్కలేదు. మళ్లీ మంగళవా రం తెల్లవారుజాము నుంచే రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ముమ్మరంగా గాలించారు. రెబ్బెన పోలీ స్‌స్టేషన్‌కు వెనుక వైపు కొంతదూరంలో పత్తిచేనులో నిందితుడికి వేసిన బేడీలు దొరికాయి. స్టేషన్ నుంచి అతడు తిర్యాణి మండలానికి చేరుకున్నట్లు గుర్తించారు. రోంపల్లి సమీపంలో స్థానికులకు వినోద్ తారసపడినట్లు సమాచారం. రోంపల్లి పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించినా బుధవారం సాయంత్రం వరకు జాడ దొరకలేదు. రెబ్బెన సీఐ సంజయ్‌తోపాటు తిర్యాణి, రెబ్బెన ఎస్సైలు, సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ విషయమై రెబ్బెన సీఐ సంజయ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


